1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nivetha Thomas fire on netizens

వక్షోజాల సైజు కొలతలు చెప్పమన్నారు... నెటిజన్లపై నివేదా థామస్ ఫైర్

Nivetha Thomas
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ నెటిజన్లపై మండిపడ్డారు. తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగి వేధించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్షోజాలు, పిరుదుల కొలతలు చెప్పమని వేధించారని వాపోయారు. దీంతో ఆమె తన చాటింగ్‌ను ఆపివేశారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్న విషయం తెల్సిందే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నివేదా థామస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా అభిమానులతో చాట్ చేసే అలవాటు ఉంది. ఇదే అదునుగా భావించిన పలువురు నెటిజన్లు ఆమెను అసభ్యకరమైన ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పలేక... తనతో చాట్ చేయడానికి సమయం కేటాయించిన వారంద‌రికి కృతజ్ఞతలు అంటూ ఆమె చాటింగ్‌ను ఆపేశారు. 
 
చాలా మంది ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చానని, కొందరు అడిగిన అస‌భ్య‌క‌ర ప్ర‌శ్న‌లు తనను చాలా ఇబ్బంది పెట్టాయని ఆమె తెలిపింది. నెటిజన్లు చాట్ చేసేది మ‌నిషితోనే అనే విష‌యం మ‌రచిపోవద్దని, అంద‌రికి మ‌ర్యాద ఇవ్వాలని నివేదా థామస్ కోరింది. త్వ‌ర‌లో మ‌ళ్లీ క‌లుద్దాం అటూ గుడ్ బై చెప్పేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా' సాంగ్..