విక్టరీ వెంకటేష్ సరసన శ్రియా.. (Video)

shriya - venky
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 8 నవంబరు 2019 (17:44 IST)
విక్టరీ వెంకటేష్ సరసన ముచ్చటగా మూడోసారి నటించేందుకు శ్రియ శరణ్ సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సుభాష్ చంద్రబోస్, చిత్రాలు వచ్చాయి. వీటిలో గోపాలగోపాల చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ జంట ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌త‌క‌ట్టేందుకు సిద్ధమ‌య్యారు.

ప్ర‌స్తుతం వెంక‌టేష్‌.. 'వెంకీమామ' చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా త‌ర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన "అసురన్" సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ఓంకార్ దర్శకత్వం వహించనున్నారు.

ఇందులో క‌థానాయిక‌గా శ్రియ‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న రూమ‌ర్‌లో నిజమెంత ఉంద‌నేది చూడాలి మ‌రి. అసుర‌న్ చిత్రం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్‌, మంజు వారియ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై మరింత చదవండి :