రెండేళ్ళ తర్వాత టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న శృతిహాసన్ (video)

shruti haasan - raviteja
ఠాగూర్| Last Updated: బుధవారం, 30 అక్టోబరు 2019 (18:43 IST)
శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో సైతం మంచి హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కేరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆమె ఇంగ్లీష్ ప్రియుడు మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చి పెటాకులైంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

అయితే, ప్రియుడుతో ఎడబాటు తర్వాత మెల్లగా కోలుకున్న శృతిహాసన్ మళ్లీ తన సినీ కెరీర్‌పై దృష్టిసారించింది. ఫలితంగా మాస్ మహారాజా నటించే చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. అంటే రెండేళ్ల విరామం తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ వెండితెరపై దర్శనమివ్వనుంది. శృతిహాసన్ చివరిసారిగా పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' చిత్రంలో నటించింది. ఈ చిత్రం 2017లో విడుదలకాగా, బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత శృతిహాసన్ కూడా వెండితెరకు దూరమైంది.

ఈ క్రమంలో ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన 'లాభం' అనే చిత్రం చేస్తుంది. దీంతో పాటు అమెరికాకి చెందిన 'ట్రెడ్‌స్టోన్'లో శృతిహాస‌న్ కీల‌క పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ వెబ్‌సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. నీరా ప‌టేల్ అనే పాత్ర‌లో శృతి క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది.

దీనిపై మరింత చదవండి :