సంబంధిత వార్తలు
- ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు
- రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య
- మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు
- ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)
- రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య
కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...
ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. తమ బంధువుల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఓ వ్యక్తిని కొందరు దుండగులు కలిసి అత్యంత దారుణంగా కాలు నరికేశారు. దానిని అందరికీ చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరివేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కర్నూలు మండలం సూదిరెడ్డి పల్లెకు చెందిన శేషన్న (54) అనే వ్యక్తి ఇంట్లో ఉండగా, మంగళవారం అర్థరాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చొరబడి వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు.
శేషన్నను దారుణంగా హతమార్చిన తర్వాత అతడి కాలును నరికి వేరు చేశారు. ఆపై దానిని గ్రామంలో ప్రదర్శించి పోలీస్ స్టేషన్ సమీపంలో పడేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
