క్విజ్ షోకు డేట్స్ ఇచ్చిన ఎన్.టి.ఆర్.
Ntr show
ఇంతకుముందు కరోనా వల్ల ఈ షో షూటింగ్ ఆగిపోయింది. అందుకే ఇప్పుడు సిబ్బందికి కరోనా పరీక్షలు పూర్తిగా నిర్వహించి సెట్‌లోకి అనుమతిస్తున్నారు. ముందుగా సాంకేతిక సిబ్బందికి ప్రత్యేకంగా జెమిటీ టీవీ యాజమాన్యం పరీక్షలు నిర్వహిస్తుంది. కరోనా టీకాలు వేసుకున్న వారికే అనుమతి ఇస్తుంది. క్విజ్ షోకు సంబంధించిన ఎపిసోడ్ల చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ఈ షో కోసం పదిరోజుల పాటు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి సరికొత్తగా షో వుండేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో టీవీ యాజమాన్యం ప్రకటించనుంది.
