బురదలోనే రెండురోజులున్న పరిణితి చోప్రా
Parinithi Chopra
అర్జున్ కపూర్‌తో నటించిన సినిమా `సందీప్ ఔర్ పింకీ పరార్`. ఇది అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవలే విడుదలైంది. ఇందులో పక్కా కొండ ప్రాంత అమ్మాయిగా నటించాల్సివచ్చింది. షూటింగ్ చేసే ప్రాంతంలో అంతా మురికిగా వుండేది. బురదగానూ వుండేది. మేకప్ సరిగ్గా లేదు. నాచురల్‌గా వుండేలా దర్శకుడు పాత్రను మలిచాడు. అయితే అక్కడ బురదలో ఎక్కువగా వుండడంలో అక్కడే ఓ గుడిసెలో రాత్రి నిద్రపోవాల్సి వచ్చింది. అందుకే మురికిగానే రెండురోజులు స్నానం చేయకుండా వున్నానంటోది. అయితే దీనికి ఓ కారణముంది. ఆ మూవీలో వుండగానే అనుకోనివిధంగా గర్భవిచ్చితి జరగడంతో ఆమె షాక్‌కు గురయింది. అందుకే ఆ మూడ్‌లోనుంచి రావడానికి టైం పట్టింది. అదే నేచురల్‌గా వుందని దర్శకుడు అలా తెరకెక్కించాడు. అందుకు ఆమెకూడా సహకరించింది.
