ప్రభాస్ ప్రశంసలందుకున్న ఏక్ మినీ కథ ట్రైలర్
Prabhas twitter
శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం చిత్రం తన కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని, ఈ మెమురబుల్ సక్సెస్ తనకు అందంచిన శోభన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ఇప్పడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు, ఏక్ మినీ కథ చిత్ర బృందానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్ చేశారు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ఏక్ మినీ కథ యూనిట్.
