గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 12 మే 2021 (21:00 IST)

బావిలోన కప్ప` సాంగ్ ను సినిమా బండి మోసుకొచ్చింది

baavilona kappa song
`అయ్యో అయ్యో అయ్య‌య్యో బావిలోన క‌ప్ప‌తీరు బెగ‌రు బెగ‌రు అంటావా, ఎండ‌లోవున్న మాడేటి కాకికి న‌ల్ల‌రంగు వేసింది ఎవ‌రో, చిల‌క‌మ్మ చిత్రాలు వేసేనా! అంటూ చిత్ర‌మైన పాట‌ను `సినిమా బండి` కోసం రాశాడు గీత ర‌చ‌యిత‌. ఇది నేడు చిత్ర యూనిట్ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది. ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సినిమా బండి'. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆద‌ర‌ణ పొందుతోంది.
 
దానిని బ‌ట్టి క‌థ గురించి చెప్పాలంటే, ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి, అతను తన గ్రామ పరిస్థితిని మెరుగుపరిచేందుకు మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. డి 2 ఆర్ ఇండీ బ్యానర్‌లో రాజ్, డికె ద్వయం ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
వికాస్ వశిష్ట, సందీప్ వారణాసి, రాగ్ మయూర్, త్రిషర, ముని వెంకటప్ప, ఉమా జి, సిరివెన్నెల యనమంధల, సింధు శ్రీనివాసమూర్తి, పూజారి రామ్ చరణ్, దవని ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సిరిష్ సత్యవోలు సంగీతం సమకూర్చారు. బావిలోన కప్ప' లిరికల్ వీడియో సాంగ్ ఎలా వుందో చూడండి.