`ఏక్ మినీకథ`తో అవకాశాలు తెచ్చుకున్న సంతోష్ శోభన్
ఒక సినిమా హిట్ అయితే చాలు. అవకాశాలు వస్తూంటాయి. అలా అని అందరికీ అలా రావడం కూడా జరగదు. పేపర్‌బాయ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ప్రభాస్ వర్షం చిత్ర దర్శకుడు శోభన్ ఈయన తండ్రి. ఎప్పటినుంచో నటుడిగా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. థియేటర్‌లో విడుదలైన పేపర్‌బాయ్‌కు పెద్దగా స్పందన రాలేదు.
తాజాగా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన `ఏక్ మినీ కథ`తో సంతోష్ శోభన్ కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా కథ కూడా ఇప్పటి యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథ. ఒకప్పుడు బక్కగా వుండే ఓ కన్నడ నటుడు ఇలాంటి తరహా కాన్పెస్ట్‌లు చేసేవాడు. దాదాపుగా ఆ తరహా కథతోనే ఏక్‌మినీ కథ వచ్చిందనే చెప్పాలి. ఇందులో హీరోకు తన సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే హీరో సంతోష్ శోభన్ కు చిన్నప్పటి నుంచి తన ప్రైవేట్ పార్ట్ విషయంలో డిస్టర్బ్ అవుతాడు. చిన్నవి అంశాలు వస్తేనే బయపడుతుంటాడు. దాని నుంచి ఎలాగైనా బయట పడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.
మగతనం చిన్నదిగా వుందనే భయం. దాంతో దానికి ఆసుపత్రికి వెళతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమా ఓటీటీలో ఆదరణ పొందింది. దాంతో ఒక్కసారిగా హీరోకు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యువి. క్రియేషన్స్, వైజయంతి మూవీస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నారు.