సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:31 IST)

నెలవారీ రీచార్జ్‌లొద్దు.. ఏడాది ప్లాన్‌కు మారిపోతే.. జియో కొత్త ప్లాన్స్ గురించి తెలుసా?

జియో సిమ్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్. నెలవారీ రీచార్జ్‌ల కంటే ఒకేసారి ఏడాది ప్లాన్‌కు మారిపోతే.. మీ డబ్బు ఆదా కావడమే కాకుండా.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కూడా దొరుకుతుంది. ఈ మేరకు కొత్త ప్లాన్‌ను జియో తీసుకొచ్చింది. ఇందుకోసం తన వినియోగదారుల కోసం మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. వీటితో మీరు ఏడాది పాటు అపరిమిత కాల్స్, డేటా, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు.
 
ప్లాన్స్ సంగతికి వస్తే.. రూ. 2121, రూ. 2399, రూ. 2599గా జియో నిర్దేశించింది. ఈ అన్ని ప్లాన్‌లతో మీకు JioTV, JioCinema, Jio Movies వంటి యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇందులో రూ.2121 జియో ప్లాన్ సంగతికి వెళ్తే.. ఇది 336 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ 1.5 జీబీ డేటా పొందవచ్చు. అంటే ఏడాది కాలంలో మొత్తం 504GB డేటాను సద్వినియోగం చేసుకోవచ్చు. దీనితో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
 
అలాగే రూ .2399 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజూ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. అంటే, ఈ ప్లాన్ కింద ఏడాదిలో 730 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది.
 
రూ. 2599ల జియో ప్లాన్ ద్వారా రోజుకు 2GB డేటా, 10GB అదనపు డేటా లభిస్తుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత మీరు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. వ్యాలిడిటీ సంవత్సరం. అంతేకాకుండా రోజుకు 100SMS, అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. ఈ అన్ని ప్లాన్స్‌కు డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు జియోటివి, జియో సినిమా, జియోన్యూస్, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.