శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (19:38 IST)

యమహా అదిరిపోయే ఆఫర్‌.. స్కూటర్‌కు చౌక వడ్డీకే రుణం

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా అదిరిపోయే ఆఫర్‌ను కొనుగోలుదారులకు అందించనుంది. యమహా స్కూటర్లపై మాత్రమే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్స్‌లో స్కూటర్ కొనే వారికి చౌక వడ్డీకే రుణం అందుబాటులో ఉంది. 
 
రుణాలపై వడ్డీ రేటు 6.99 శాతం నుంచి ప్రారంభమౌతోంది. చౌక వడ్డీకే రుణాలు మాత్రమే కాకుండా మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. స్కూటర్ కొనుగోలుపై రూ.5000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. 
 
ఇకపోతే ఇది పరిమితి కాల ఆఫర్. అంటే ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. అందువల్ల మీరు స్కూటర్ కొనాలంటే దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. 
 
యమహా మోటార్స్ ఇండియా మెగా సేవింగ్ ఆఫర్ పేరుతో స్కూటర్ కొనుగోలుదారులకు ఈ ఆఫర్లు అందిస్తోంది. యమహా ఫ్యాసినో, జెడ్ఆర్ స్కూటర్ కొనుగోళ్లకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.