1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. why anushka shetty not getting offers

బరువు సమస్యతో సతమతమవుతున్న బాహుబలి ముద్దుగుమ్మ (video)

anushka shetty
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని స్టార్ నటీమణుల్లో అనుష్క శెట్టి ఒకరు. హీరోయిన్లు బ్లాక్‌బస్టర్లు కొట్టగలరని నిరూపించినవారిలో అనుష్క ఒకరు. సైజ్ జీరో తరువాత, ఆమె కెరీర్ కాస్త తాబేలు వేగంలా మారింది. ఎందుకంటే సైజ్ జీరో కోసం బాగా లావెక్కింది. ఇక అప్పట్నుంచి ఆ బరువును ఎంత తగ్గించుకుందామన్నా వల్లకావడం లేదట.
 
ఎన్ని వర్కవుట్లు చేసినా శరీర బరువు అదుపులోకి రావడంలేదట. దీనితో ఆమె సినిమాలు కూడా తగ్గాయి. ఆమె యువి క్రియేషన్స్ బ్యానర్ కోసం ఒక చిత్రానికి సంతకం చేసింది. చేతిలో ఆ ఒక్క చిత్రం తప్ప మరేమీ లేవని అంటున్నారు. 
 
ఇదిలావుంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్తకొత్త ముద్దుగుమ్మలు దూసుకు వస్తుండటంతో సీనియర్ హీరోయన్లకు మామూలుగానే ఆఫర్లు తగ్గుతున్నాయి. మరి వారికి పోటీ ఇవ్వాలంటే ఆ స్థాయిలో శరీరాన్ని మార్పు చేసుకోవాల్సిందే.

 
తర్వాతి కథనం
ఔరంగజేబు చెల్లెలుగా జాక్వెలిన్, హరిహర వీరమల్లును ఏం చేస్తుంది?