సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (15:07 IST)

విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌.. ఏంటది?

ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ, అలయన్స్ ఎయిర్ విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ సమ్మర్‌లో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది. తగ్గింపు రేట్లలో 60,000 విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. రూ.999 రూపాయల నుంచి టికెట్‌ ధరలు ప్రారంభం కానున్నాయి.
 
ఈ ఆఫర్ మార్చి 13 నుండి ప్రారంభమై మార్చి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణీకులు ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు.
 
ఢిల్లీ-జైపూర్/ప్రయాగ్‌రాజ్‌, హైదరాబాద్-బెలగాం, అహ్మదాబాద్ -కాండ్లా, బెంగళూరు-కొచ్చి /కాజీకోడ్‌ వంటి పలు నగరాలకు అందుబాటులో ఉంటాయి. టికెట్లు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటారో వారికే ఈ ఆఫర్ వర్తించనుంది. బయలుదేరడానికి ఒక వారం ముందు తేదీని ఉచితంగా మార్చకోవచ్చు.