శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (16:13 IST)

ప్రభాస్ 25” అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే ?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పలు వరుస ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఇవన్నీ దాదాపుగా పాన్ ఇండియా మూవీలే కావడం గమనార్హం. ఆ సినిమాలన్నీ త్వరగా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన 'రాధే శ్యామ్', 'సలార్', 'ఆది పురుష్', 'ప్రాజెక్ట్ కే' వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ 25 సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్‌‍తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రభాస్ తన 25వ సినిమాను అక్టోబర్ 7న నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించనున్నారు. 
 
కానీ అప్పటివరకూ చిత్ర బృందం ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు బ్లాక్‌బస్టర్‌లను అందుకున్న బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తారని, దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తారని వార్తలు వచ్చాయి.