1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rahul Sipligunj meets Superstar Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రాహుల్ సిప్లగింజ్.. నక్క తోక తొక్కేశాడుగా..!

Rahul Sipligunj
Rahul Sipligunj
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్, సింగర్ రాహుల్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. టాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగార్జున హోస్ట్ చేసిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ -3కి విన్నర్‌ అయిన రాహుల్.. సూపర్ స్టార్ రజినీకాంత్‌ యాక్ట్ చేస్తోన్న సినిమాలో కీలక పాత్ర చేయనున్నట్టు సమాచారం. వ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇందులో రాహుల్‌ది కీలక పాత్ర కావడం విశేషం. 
 
తాజాగా రాహుల్.. రజీనీకాంత్‌తో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కృష్ణవంశీ సినిమా ‘రంగమార్తాండ’లో ఓ పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఈ చిత్రంలో రాజశేఖర్ కూతురు శివాత్మకకూ.. జోడిగా నటిస్తున్నాడు. తాజాగా సూపర్‌స్టార్ ఛాన్స్ రావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. బిగ్ బాస్ తర్వాత రాహుల్ వరుస అవకాశాలతో ఫుల్ జోష్ మీదున్నాడు.  
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఈ వాలెంటైన్స్ డేని గ్రాండ్‌గా చేసుకుంటాం.. సన్నీ భర్త