గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 31 జనవరి 2020 (18:04 IST)

20 లక్షల మందికి కిక్ ఇస్తూ శ్రీముఖి ఫోటోస్ షేర్, పెద్దతెర కోసం గేలం వేస్తుందా?

బుల్లి తెర రాములమ్మ అంటూ పిలుపించుకుంటున్న యాంకర్ శ్రీముఖి ఒక్కసారిగా తనలో వున్న ఇంకో కోణాన్ని చూపించింది. గ్లామరస్ దుస్తులు వేసుకుని వాటిని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రజనం ఎవరిష్టం వచ్చినట్లు వారు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 

విషయం ఏమిటంటే... శ్రీముఖికి తన ఇన్‌స్టాగ్రాంలో 20 లక్షల మంది ఫాలోయర్లు వున్నారు. ఇప్పుడు వీరిలో కొందరు ఆమెను ప్రోత్సహిస్తుంటే మరికొందరు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు.
ఆఫర్స్ తగ్గాయా, అందుకే ఇలాంటి డ్రస్‌లు వేసుకుంటున్నావా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకు వేసి మాంచి కసి మీద వున్నావ్ అంటూ అసభ్య పదజాలాన్ని వాడుతూ పోస్టులు పెడుతున్నారు. మరి శ్రీముఖి బోల్డ్ అవతార్... ఆమెకి ఎంతమేరకు కలిసి వస్తుందో తెలియదు కానీ బుల్లితెరపై ఫ్యామిలీ యాంకర్ అనిపించుకున్న శ్రీముఖిని చూసి ఆటైపు ఆడియెన్స్ అమ్మో అని అంటున్నారు.