హీరోయిన్లా లేకుంటే.. రవివర్మ గీసిన బొమ్మలా? ఫోటోలు వైరల్ (Video)

సెల్వి| Last Updated: మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (16:15 IST)
Samantha Akkineni
సోషల్ మీడియాలో ప్రస్తుతం హీరోయిన్ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రవివర్మ వేసిన బొమ్మల్లా హీరోయిన్లు ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇంకా ఆ ఫోటోలను నెట్టింట పోస్టు చేసి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ సమంతతో పాటు పలువురు హీరోయిన్లు తాజాగా షేర్‌ చేస్తోన్న ఫొటోలను చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

హీరోయిన్లు ఖుష్బూ, ఐశ్వర్యా రాజేష్, మంచు లక్ష్మి, శ్రుతిహాసన్, రమ్యకృష్ణలు పెయింటింగ్ రూపాల్లో వున్న బొమ్మలుగా మారిపోయారు. నామ్ ఫౌండేషన్ సెలబ్రిటీ క్యాలండర్ కోసం రవివర్మ చిత్రాల్ని మైమరిపిస్తూ అందాల హీరోయిన్లు సమంత, శ్రుతిహాసన్, ఐశ్వర్య రాజేశ్, రమ్య కృష్ణ, మంచు లక్ష్మి, ఖుష్బూ సుందర్ వంటి కొందరు ఈ ఫొటోల్లో వారంతా కనపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్ల ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఫోటోల్లో అచ్చం రవివర్మ గీసిన బొమ్మలకు ప్రతిరూపంలా హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా తమ ఫొటోలను ఇంత అందంగా తీర్చిదిద్దిన ఫొటో గ్రాఫర్లకు హీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు లైకులు వెల్లువల్లా వస్తున్నాయి.

దీనిపై మరింత చదవండి :