గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (17:15 IST)

'జాను' సమంత లుక్‌లో ఏదో తేడా కనిపిస్తోందే? మీకూ కనిపిస్తుందా? (Video)

'జాను' సమంత లుక్‌లో ఏదో తేడా కనిపిస్తోందే?
సినిమాల్లో నటించే హీరోహీరోయిన్లు తమ అందాన్ని పెంచుకునేందుకు నిత్యం ఏవో ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. శ్రీదేవి తన బుర్రముక్కును కోటేరు ముక్కులా మార్చుకునేందుకు సర్జరీలు చేయించుకున్నది. అలాగే చాలామంది తమ ఒంట్లో కొవ్వు పేరుకునిపోతే దాన్ని తొలగించుకునేందుకు చికిత్స చేయించుకుంటుంటారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఫిబ్రవరి 1 రాత్రి సమంత కీలకంగా నటిస్తున్న తమిళ రీమేక్ 96 చిత్రం జాను ప్రి-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ఎర్రచీరలో అందంగా నడుచుకుంటూ వచ్చింది ఓ తార. ఆమె ఎవరబ్బా అని లిప్తకాలం పాటు చాలామంది ఆలోచనలో పడ్డారు. తీరా ఆమె సమంత అని చెప్పగానే అలా అనుకున్నవాళ్లంతా షాక్ తిన్నారు. 
సమంత న్యూ లుక్
 
ఆమె లుక్ లో ఏదో తేడా కొట్టొచ్చినట్లు కనిపించడమే దీనికి కారణం. ఆమె ముక్కు కోటేరు ముక్కులా మారిపోయింది. అంతకుముందు సమంత ముక్కు, నోరుకి ఇప్పటి ముక్కూ,నోరుకి ఎక్కడో తేడాలున్నట్లు ఈవెంటుకి హాజరైనవారిలో కొందరు చర్చించుకోవడం కనబడింది. మరి ఇలాంటి అనుమానం ఈ ఫోటోలు చూసి మీక్కూడా కలుగుతుందా... లేదంటే సమంత అప్పటిలాగే ఇప్పుడు కూడా అలాగే వుందా. చూసుకోండి మరి ఈ ఫోటోలు.