గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:06 IST)

#DishaCase #Encounter సమంత ట్వీట్.. అందుకే తెలంగాణ అంటే ప్రేమ

శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో నవంబరు 28న రాత్రి లారీలపై పని చేసే నలుగురు వ్యక్తులు దిశాను అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లి షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి వద్ద తగులబెట్టారు. 
 
ఈ హత్యాచార ఘటన తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలని అందరూ డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు దిశా నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటనపై టాలీవుడ్ హీరోయిన్ సమంత ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. 
 
ఈ వ్యవహారంపై సమంత స్పందిస్తూ తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో కొంత భయాన్ని మిగితవారిలో కలిగించారని.. అప్పడప్పడూ ఇలాంటివి అవసరం అని చెప్పింది. అందుకే తెలంగాణ అంటే ప్రేమ అని తెలిపింది.