సంబంధిత వార్తలు
- ఎన్‌కౌంటర్ కింగ్.. శభాష్ సజ్జనార్... నాడు స్వప్నిక.. నేడు దిశ.. ప్రజలు కోరుకున్నట్టుగానే..
- #RIPDisha ఆరంభించిన చోటే ముగించిన పోలీసులు.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్
- పుట్టింటికి వెళ్లిన భార్య.. బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసిన డ్రైవర్
- భార్య ప్రసవానికి వెళితే, పనిచేస్తున్న బాలికపై అత్యాచారం చేశాడు
- దిశ హత్య కేసు: నాలుగో నిందితుడిని చెడగొట్టిన మొదటి నిందితుడు
దిశ నిందితులను ఎందుకు ఎన్‌కౌంటర్ చేశామంటే....
దేశంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ కేసు రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా, ఘటనా స్థలానికి నలుగురు నిందితులను శుక్రవారం వేకువజామున గట్టిభద్రత మధ్య తీసుకెళ్లారు. అక్కడ పోలీసులపై నలుగురు నిందితులు తిరగబడ్డారు. అంటే.. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కొని వారిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ, దిశ హత్య కేసు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారని, ఆ పరిస్థితుల్లో తప్పనిసరై తాము ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఆయన శుక్రవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, ఈ తెల్లవారుజామున సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలికి తీసుకుని వచ్చినట్టు తెలిపారు. ఆ సమయంలో నిందితులు పోలీసుల ఆయుధాలను లాక్కున్నారని, ఆ వెంటనే ఫైరింగ్‌ను ఓ పెన్ చేశారని తెలిపారు. ఆత్మ రక్షణార్థం జరిపిన కాల్పుల్లో వారు మరణించారని, తామేమీ ఎన్‌కౌంటర్ చేసి వారిని హతమార్చాలన్న ఆలోచనలో లేమని స్పష్టంచేశారు.
