''దిశ'' ఘటన.. సమంత ఆ రోల్‌లో కనిపిస్తుందా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసుపై సినిమా రానుంది. ఓ అమ్మాయిని అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన మృగాళ్లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ఈ కథకు ఓ పర్ఫెక్ట్ ముగింపు దొరికింది. అయితే ఇప్పుడు దీనిపై సినిమా వాళ్ల కన్ను కూడా పడుతుందని తెలుస్తుంది. ఎమోషనల్‌గా దేశం మొత్తాన్ని కదిలించిన సీన్ కావడంతో ఇలాంటి ఎపిసోడ్ ఒకటి సినిమాలో ఉంటే అదిరిపోతుందని ప్రతీ దర్శక నిర్మాత కూడా భావిస్తున్నాడు.
అందుకే తమ సినిమాల్లో దిశ ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో అందరికంటే ముందు తమిళ దర్శకుడు దిశ ఎపిసోడ్ నేపథ్యంలో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సంచలన పాత్రలో అక్కినేని కోడలు సమంత నటించబోతుందని ప్రచారం జరుగుతుంది.
పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్న సమంత.. యూ టర్న్, ఓ బేబీ సినిమాలతో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా దిశ ఉదంతంపై తెరకెక్కుతున్న సినిమాకు ఈమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది.