ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (09:52 IST)

బాలయ్య సినిమా దిశ ఎపిసోడ్.. ప్లాన్ చేస్తోన్న బోయపాటి

దిశ అత్యాచార హత్యోదంతంపై సినిమా తీసేందుకు టాలీవుడ్ సిద్ధమవుతోంది. దిశ ఎన్‌కౌంటర్‌పై కన్నేసిన టాలీవుడ్ దర్శక నిర్మాతలు.. సినిమా తీస్తే కలెక్షన్లు రాబట్టుకోవచ్చునని భావిస్తున్నారు. ఓ సినిమాలో దిశ ఎపిసోడ్ మొత్తాన్ని ఇతివృత్తంగా వాడుకోవాలని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈ ఎపిసోడ్ గురించి ఆరా తీస్తున్నారు. 
 
ముందుగా ఈ సీన్ బాలయ్య సినిమాలో కనిపించబోతుందని ప్రచారం మొదలైంది. బోయపాటితో ఈయన త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. దీని ఓపెనింగ్ ఈ మధ్యే జరిగింది. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. 
 
ఈ సినిమాలో బాలయ్య దిశ ఘటనను ఓ సన్నివేశంలో చూపెట్టాలని బోయపాటికి చెప్పినట్లు తెలుస్తోంది. సింహా సినిమా సమయంలో యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన ఎపిసోడ్ పెట్టాడు బోయపాటి శ్రీను. ఇక లెజెండ్‌లో అమ్మాయిలను పురిటిలోనే చంపే వారికి బుద్ధి చెప్పే సీన్ కూడా పెట్టాడు. ఇప్పుడు కూడా దిశ ఎపిసోడ్ ఒకటి ఈ చిత్రంలో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.