Niharika: టికెట్ ధరను రూ.100గా ఫిక్స్ చేసిన రాకాస మేకర్స్
Rakasa Ticket price fixed at ₹100
లేటెస్ట్‌గా మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసే పనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరను రూ.100గా ఫిక్స్ చేశారు. దీంతో రాకాస చిత్రం సామాన్యుడికి మరింత చేరువ కానుంది. చక్కటి అర్థవంతమైన కామెడీతో ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. సంగీత్, గెటప్ శీను ట్రాక్ ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, నటనకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ సమ్మర్‌లో కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడటానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు.
జీస్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్టకర్ మానస శర్మ టేకింగ్ సహా ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ పని తీరుని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. నిర్మాతగా నిహారిక తన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్లుతో బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
