1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rakshasa Kavyam is getting ready for grand release

గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న రాక్షస కావ్యం

Abhay Naveen, Anvesh
Abhay Naveen, Anvesh
అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 6న “రాక్షస కావ్యం” సినిమాను గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.
 
ఇప్పటికే “రాక్షస కావ్యం” సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత వారం విడుదల చేసిన విలన్స్ ఆంథెమ్ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ అయ్యింది. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేటర్స్ లో ఈ సినిమాను చూడాలనే క్రేజ్ సినీప్రియుల్లో ఏర్పడుతోంది.
About Writer
డీవీ
తర్వాతి కథనం
బాబాయ్ హోటల్‌ మదీనా గూడ బ్రాంచ్‌ను ప్రారంభించిన అశోక్ గల్లా, మానస వారణాసి