ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2023 (15:01 IST)

రామన్న యూత్ గురించి చెప్పగానే చాలా ఆనందమేసింది: డా.జయప్రకాష్ నారాయణ

Dr. Jayaprakash Narayana, Abhay Naveen and team
Dr. Jayaprakash Narayana, Abhay Naveen and team
అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “రామన్న యూత్” సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ ను లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా డా.జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ - చాలామంది యువత రాజకీయాలు అంటూ సరైన నాయకుడిని ఎంచుకోకుండా గుడ్డిగా తిరిగి జీవితాలు పాడుచేసుకుంటున్నారు అనే బాధ నాకు ఎప్పుడూ ఉండేది. అలాంటి అంశాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి వినోదాన్ని జోడించి ఒక మంచి సినిమా చేశారు. “రామన్న యూత్” సినిమా గురించి చెప్పగానే నాకు చాలా ఆనందమేసింది.. ఇలాంటి సినిమాలని మనమందరం సపోర్ట్ చేయాలి. సినిమా అనేది ఎంటర్ టైన్ చేస్తూనే ఎడ్యుకేట్ చెయ్యాలి. “రామన్న యూత్” టీజర్ చూశాను చాలా బాగుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు
 
హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ - మా సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి కృతజ్ఞతలు. రాజు అనే ఒక యువకుడు పొలిటికల్ లీడర్ గా  ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మా “రామన్న యూత్” చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కించాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాజకీయ నాయకుల కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారు. ఆ యువతను కొందరు నేతలు ఎలా తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అనేది “రామన్న యూత్” సినిమాలో వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా తెరకెక్కించాం. సినిమా అంతా సహజంగా మన ఊరిలో జరిగిన ఫీలింగ్ కలిగిస్తుంది. సెప్టెంబర్ 15న “రామన్న యూత్” చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక మంచి  ప్రయత్నం చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.