1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2023 (12:48 IST)

పాకిస్థాన్‌లో ఘోరం... డీజిల్ డ్రమ్ములు పగిలి 18 మంది సజీవదహనం

పాకిస్థాన్ దేశంలో దారుణం జరిగింది. డీజిల్ డ్రమ్ములు పగలడంతో ఏకంగా 18 మంది సజీవ దహనమయ్యారు. ప్రయాణికులకు వేగంగా వెళుతున్న బస్సు .. ముందు వెళుతున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వ్యానులోని డీజిల్ డ్రమ్ములు పగిలిపోవడంతో డీజల్ మొత్తం నేలపాలైంది. ఆ తర్వాత మంటలు చెలరేగి, బస్సు, వ్యానుకు అంటున్నాయి. ఈ మంటల్లో చిక్కుకోవడంతో బస్సులోని ప్రయాణికుల్లో 18 మంది సజీవదహనమయ్యారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 
 
కరాచీ నుంచి సుమారు 40 మంది ప్రయాణికులతో ఓ బస్సు శనివారం రాత్రి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. ఈ బస్సు పిండి భట్టియాన్ అనే ప్రాంతంలో వెళుతుండగా ముందు వెళుతున్న వ్యానును ఢీకొట్టింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో బస్సు, వ్యానుకు అంటున్నాయి. 
 
ముంటలు ఒక్కసారిగా చెలరేగడంతో కొందరు ప్రయాణికులు కిటికీల్లోను దూకి తమ ప్రాణాలను రక్షించుకోగా, మరికొందరు ఆ మంటల్లో కాలిపోయారు. ప్రమాదంలో వ్యాను డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారని డిస్ట్రిక్ పోలీస్ ఆఫీసర్ ఫహద్ తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.