పాకిస్థాన్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దాదాపు 500 రోజులుగా భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకపోగా, పాకిస్థాన్‌లో మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం ఆ దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
గురువారం నుంచి పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 290, ఒక లీటర్ డీజిల్ 293 రూపాయలు. భారత్‌లో పెట్రోల్ ధర రూ.104, డీజిల్ ధర రూ.94గా ఉండగా, పాకిస్థాన్‌లో ఇది రెట్టింపు ధర కావడం గమనార్హం.
అప్పుల భారం పెరగడంతోపాటు పాకిస్థాన్ విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గాయి. పాకిస్థాన్ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోలేక పోవడంతో ఆ దేశ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.