ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (19:41 IST)

Redmi Pad SE: టాబ్లెట్ ధర, ఫీచర్లు ఏంటంటే?

Redmi Pad SE
Redmi Pad SE
Redmi Pad SE త్వరలో లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే టాబ్లెట్ ధర, ఫీచర్లు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం లీక్ అయిన వివరాల ప్రకారం, కొత్త రెడ్‌మి టాబ్లెట్ మూడు విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది మెటాలిక్ బిల్డ్ కలిగి ఉంటుందని కూడా చెప్తున్నారు.
 
ఫీచర్ల విషయానికొస్తే, కొత్త Redmi Note SE మోడల్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 4GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇది 11-అంగుళాల 1200x1920 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్‌ను కూడా కలిగి ఉంది. దీనితో పాటు 8000 mAh బ్యాటరీ, 10 వాట్ల ఛార్జింగ్ సదుపాయం అందించబడింది. 
 
MIUI 14 ఆధారంగా Android 13, 8MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, క్వాడ్ స్పీకర్లు, Dolby Atmos సౌకర్యం అందించబడింది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్ 5, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీట్, హాల్ సెన్సార్ ఉన్నాయి. దీని ధర రూ.14,999గా నిర్ణయించారు.