సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (22:49 IST)

రియల్‌మి ప్యాడ్ 2 వచ్చేస్తోంది.. 5G సపోర్ట్ చేయదు.. కానీ..?

Realme Pad 2
Realme Pad 2
రియల్‌మి నుంచి సరికొత్త మోడల్ టాబ్లెట్ వస్తోంది. ఈ నెల 19న ఈ కొత్త టాబ్లెట్ మార్కెట్లోకి వచ్చేయనుంది. రియల్‌మి ప్యాడ్ 2కి బ్లాక్, గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. రియల్‌మి ప్యాడ్ 2 టాబ్లెట్ డివైజ్ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
రియల్‌మి ప్యాడ్ 2 మోడల్ 2000×1200 పిక్సెల్‌ల రిజల్యూషన్, 450 పీక్ బ్రైట్‌నెస్‌తో 11.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. రియల్‌మి Pad 2 టాబ్లెట్ 5G సపోర్టు చేయకపోవచ్చు. ఇందులో వైఫై ఓన్లీ వేరియంట్ మాత్రమే కనిపిస్తుంది. 33Wతో 8360mAh బ్యాటరీ, ఒకే బ్యాక్ కెమెరా కలిగి ఉండవచ్చు.