గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జులై 2023 (12:22 IST)

తారా స్థాయికి చేరిన టమోటా ధర .. ఒక కేజీ రూ.300

tomatto
దేశంలో టమోటాల ధర నానాటికీ పెరిగిపోతుంది. చండీగఢ్ మార్కెట్‌లో ఒక కేజీ టోమోటాలు ఏకంగా రూ.300 పలుకుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇవి రూ.200 నుంచి రూ.250 మేరకు పలుకుతున్నాయి. అయితే, చిల్లర మార్కెట్‌లో మాత్రం వీటి ధరలు మరింత అధికంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.
 
కాస్త తక్కువ నాణ్యత ఉన్న టమాటా అదే మార్కెట్‌లో రూ.100-150గా ఉంది. ఈ ధరలు చూసిన స్థానికులు.. లీటర్‌ పెట్రోల్‌ కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు. ధరలు పెరుగుతున్న క్రమంలో టమాటాలు నిల్వ ఉంచుకున్న వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 
కుమార్తె వరుసయ్యే యువతిని గర్భవతిని చేసిన బాబాయ్.. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కుమార్తె వరుసయ్యే యువతిని కామంతో కళ్ళు మూసుకునిపోయిన వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి గర్భవతిని చేశాడు. ఈ దారుణం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో జరిగింది. దీనిపై బాధితురాలు మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆశ్రయించగా వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఈ దారుణం జరిగిన ప్రాంతం తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలియడంతో అక్కడకు బదిలీ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.