ఛత్రపతి కోసం హిందీ నేర్చుకుంటున్న సాయి శ్రీనివాస్
bellam konda
సినిమాలో తన లుక్, బాడీ లాంగ్వేజ్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలని డిసైడైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఇందుకోసం ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సరైన పద్దతిలో కసరత్తులు చేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మజిల్స్ విషయం స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అంతే కాదు...ఛత్రపతి హిందీ రీమేక్‌లో తన వాయిస్‌కు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. హిందీ భాషపై అవగాహన ఉన్నప్పటికీ మరింత పట్టుసాధించేందుకు, ఉచ్ఛారణ పరంగా మరింత స్పష్టత ఉండాలని భావించి ఫేమస్ హిందీ కోచ్ ఇంతియాజ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్.
ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌ను దక్షిణాది భాషల్లో డబ్బింగ్‌చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. వీవీ వినాయక్‌కు కూడా హిందీలో తొలి చిత్రం ఇదే కావడం విశేషం. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు.
