శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 24 సెప్టెంబరు 2020 (17:41 IST)

చిరు నెక్ట్స్ మూవీ మెహర్‌తోనా..? వినాయక్‌తోనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే... ఆచార్య తర్వాత చిరు ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. మెహర్ రమేష్‌తో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. 
 
మెహర్ రమేష్‌.. చిరుతో వేదాళం రీమేక్ ప్లాప్ చేస్తున్నాడు. రీసెంట్‌గా చిరుకు కథ.. ఆయన ఓకే చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే... మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీ రీమేక్ చేసేందుకు చిరు ఓకే చెప్పారు.
 
ఈ మూవీని సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించాలి అనుకున్నారు కానీ.. సుజిత్ తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా చేసిన మార్పులు చిరంజీవికి నచ్చలేదు. దీంతో సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
 
ఈ సినిమాని తెరకెక్కించే బాధ్యతను చిరంజీవి డైనమిక్ డైరెక్టర్ వినాయక్‌కి అప్పగించారు. వినాయక్ తన టీమ్‌తో కథలు మార్పులు చేసారు. రీసెంట్‌గా వినాయక్ చిరుకు కథ చెప్పడం.. ఆయన చేసిన మార్పులకు ఓకే చెప్పడం జరిగింది. అయితే... ఆచార్య తర్వాత ఎవరితో సినిమా స్టార్ట్ చేయాలి అని చిరు ఆలోచనలో పడ్డాడని టాక్ వినిపిస్తుంది.
 
 అయితే.. చిరంజీవి మెహర్ రమేష్‌తోనే ముందుగా సినిమా చేయాలనుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే మెహర్ రమేష్‌తో మూవీ గురించి అఫిషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుందని టాక్.