శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:31 IST)

మెహర్ రమేష్‌కి చిరంజీవి పెట్టిన కండీషన్ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి డైరెక్టర్స్ సుజిత్, మెహర్ రమేష్, బాబీలతో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. అయితే.. ఫామ్‌లో లేని మెహర్ రమేష్ తో మూవీ వార్తలకే పరిమితం అవుతుంది అనుకున్నారు కానీ చిరంజీవి.. మెహర్ రమేష్‌తో సినిమా చేయడానికే ఫిక్స్ అయ్యారు.
 
ఇటీవల మెహర్ రమేష్ చిరంజీవికి ఫుల్ స్ర్కిప్ట్ చెప్పారు. కథ విని చిరు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసారట. ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదట. అయితే.. చిరు ఒక కండీషన్ పెట్టారట. ఇంతకీ.. ఆ కండీషన్ ఏంటంటే, బడ్జెట్ విషయంలో ఒక అమౌంట్ చెప్పి అంతలోనే సినిమా పూర్తి చేయాలి అని చెప్పారట. చిరు ఎందుకు అలా చెప్పారంటే.. మెహర్ రమేష్ స్టైలీష్‌గా ఉండాలని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టిస్తారని టాక్.
 
ఇంకా చెప్పాలంటే.. అది టాక్ కాదు వాస్తవమే. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే చిరంజీవి బడ్జెట్ విషయంలో కండీషన్ పెట్టారని తెలిసింది. అలాగే భారీ తారాగణం కోసం అంటూ స్టార్ల వెంటపడకుండా.. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లనే ఎంచుకోవాలి అని చెప్పారని తెలిసింది.
 
 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు..? చిరు సరసన ఎవరు నటించనున్నారు..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.