సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్
Zebra Character Revealing Motion-Poster
మోషన్ పోస్టర్ సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, డాలీ ధనంజయ, సత్య దేవ్‌లని పరిచయం చేసింది. ప్రతి పాత్రను ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ తో ప్రజెంట్ చేశారు. మోషన్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది.
చివరి ఫ్రేమ్‌లలో మొత్తం నటీనటులు కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో కాయిన్ తిప్పడం, కరెన్సీ నోట్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి కారు దూకడం వంటి ఎక్సయిటింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ క్రియేటివ్ గా ప్రజెంట్ చేశారు. రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ని మరింత పెంచింది. ఈ మైండ్ బ్లోయింగ్ మోషన్ పోస్టర్ ద్వారా జీబ్రా అక్టోబర్ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో,హిందీలో థియేటర్లలోకి రానుందని అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ ఈ దీపావళి మరింత స్పెషల్ వుండబోతోందని ప్రామిస్ చేస్తోంది.
లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.
తారాగణం: సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు.

