బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (17:26 IST)

పడక సీన్లలో నటించడం అంత ఈజీ కాదు : మాళవికా మోహనన్

Malavika Mohanan
పడక సీన్లలో నటించడం అంత ఈజీ కాదని హీరోయిన్ మాళవికా మోహనన్ అన్నారు. ఆమె చేసిన తొలి బాలీవుడ్ ప్రాజెక్టు యాధ్రా. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె అనేక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, సీనియర్ నటులు రేఖ, రజనీకాంత్‌‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
'ఓ అవార్డుల వేడుకలో రేఖను తొలిసారి నేరుగా చూశా. ఆమె పక్కనే కూర్చొన్నా. డిన్నర్‌ చేశావా? ఎక్కడి నుంచి వచ్చావ్‌? అంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడే విధానం ఆకట్టుకుంది. ఓవైపు ఆనందంగా ఉన్నా మరో వైపు.. నాకు పురస్కారం (బియాండ్‌ ది క్లౌడ్స్‌ సినిమాకిగానూ) వస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు.. నాకు అవార్డు దక్కకపోవడంతో బాధపడ్డా. పైకి కనిపించకుండా మేనేజ్‌ చేశా. కానీ, నా బాడీ లాంగ్వేజ్‌ పరిశీలించిన రేఖకు నా ఫీలింగ్‌ అర్థమైంది. 'ఫర్వాలేదు.. భవిష్యత్తులో నువ్వు ఎన్నో పురస్కారాలు పొందుతావు' అంటూ నన్ను ప్రోత్సహించారు.
 
రజనీకాంత్‌ గురించి మాట్లాడుతూ.. 'కోలీవుడ్‌లో నేను నటించిన తొలి సినిమా ‘పేట’. అందులో నేను కీలక పాత్ర పోషించా. నేను ఎక్కడి నుంచో వచ్చానో, నా కుటుంబం గురించి రజనీకాంత్‌కు తెలుసు. ఆయన పెద్ద స్టార్‌ అయినా.. నేను కంఫర్ట్‌గా ఉన్నానో లేదోనని అడిగేవారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు' అని పేర్కొన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు.మోహనన్‌ కుమార్తె మాళవిక. ‘మాస్టర్‌’, ‘తంగలాన్‌’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సిద్ధాంత్‌ చతుర్వేది సరసన ఆమె నటించిన ‘యుధ్రా’ ఈ నెల 20న విడుదల కానుంది.