గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 ఆగస్టు 2024 (16:40 IST)

గృహంలో మనీ ప్లాంట్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏమిటి?

Money Plant
మనీ ప్లాంట్. ఈ మొక్క ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ఇస్తుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మొక్క బెంజీన్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ మరియు జిలీన్ వంటి ఇండోర్ గాలి నుండి గాలిలో ఉండే కాలుష్య కారకాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలికి విలువను జోడిస్తుంది. ఇంకా మనీ ప్లాంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మనీ ప్లాంట్ ఉన్న గదిలోని గాలిలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది, సులభంగా శ్వాస తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది.
ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఇంట్లో వాదనలను, ఆందోళన, నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది.
మనీ ప్లాంట్లు మన ఇళ్లు, కార్యాలయాల లోపల పెట్టుకుంటే అవి యాంటీ రేడియేటర్‌గా పనిచేస్తాయి.
కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ స్థాయిని తగ్గిస్తాయి.
వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్‌లను ఇంటి లోపల ఆగ్నేయ దిశలో ఉంచాలి.
ఈ మనీ ప్లాంట్ ఇంట్లో శాంతి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, వైవాహిక సమస్యలను దూరం చేస్తుంది.
ఇంటి యజమానుల దురదృష్టాన్ని తొలగిస్తుందని, అదృష్టం- సంపదను ఇస్తుందని విశ్వాసం.
గ్రీన్ మనీ ప్లాంట్ ఇంటి చుట్టూ అనుకూలశక్తిని వ్యాపింపజేసి వ్యాధులను అరికట్టడంలో సహాయపడుతుంది.