ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 23 ఆగస్టు 2024 (19:00 IST)

కోల్డ్ కాఫీ తాగుతున్నారా?

ఉదయాన్నే ఓ కప్పు వేడీ కాఫీ తాగితే కానీ తర్వాత పనులు మొదలుపెట్టరు చాలామంది. ఐతే వేసవి ఎండల్లో కోల్డ్ కాఫీ తాగుతుంటే ఆ మజా వేరు అంటున్నారు. కోల్డ్ కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలున్నాయని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
వేడి కాఫీలా, కోల్డ్ బ్రూ కాఫీలో కెఫీన్ ఉంటుంది, కనుక దీన్ని తాగేవారి విశ్రాంతి జీవక్రియ రేటు పెంచుతుంది.
కోల్డ్ కాఫీలో వుండే కెఫిన్ వినియోగం నిద్రలేమి వ్యక్తులలో మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
కోల్డ్ కాఫీ తాగేవారిలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెపుతున్నారు.
ఈ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అంటున్నారు.
కోల్డ్ కాఫీ తాగుతుంటే పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు
వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ కడుపులో సులభంగా జీర్ణమవుతుంది.