బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (21:53 IST)

రీల్స్ చేస్తూ.. రైలు వస్తున్నది గమనించలేదు.. భార్యాభర్తలు, కుమారుడు మృతి

train
రీల్స్ ఓ కుటుంబాన్ని బలిగొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తుండగా, రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్-ఖేరీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
బుధవారం ఉదయం లక్నో నుంచి పిలిభిత్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 
 
సీతాపూర్ జిల్లాలోని లాహర్‌పూర్‌కు చెందిన భార్యాభర్తలు తమ మూడేళ్ల కొడుకుతో కలిసి బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో వీడియో తీస్తున్నప్పుడు ఆ ముగ్గురిని రైలు ఢీకొంది. కానీ, రైలు వస్తున్న విషయం వారు గమనించలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.