శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:15 IST)

భార్య, నవజాత శిశువును కాపాడాలి.. మూడేళ్ల కుమారుడిని అమ్మేశాడు..

baby
భార్యతో పాటు నవజాత శిశువును కాపాడేందుకు ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఒక వ్యక్తి తన భార్య, నవజాత శిశువును ప్రైవేట్ ఆసుపత్రి నుండి రక్షించడానికి తన మూడేళ్ల కొడుకును బలవంతంగా విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లోని బర్వా పట్టిలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు సత్వరమే స్పందించి చిన్నారిని తీసుకెళ్లిన దంపతులతో సహా ఐదుగురిని శనివారం అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళికే.. బార్వా పట్టి నివాసి హరీష్ పటేల్ అనే వ్యక్తి రోజువారీ కూలీగా పని చేస్తూ తన భార్య ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాడు. అయితే వెంటనే ఆస్పత్రికి కట్టాల్సిన మొత్తం కట్టలేక తల్లీ, బిడ్డను వారు బయటకు పంపలేదు. ఇది పటేల్‌కు ఆరవ సంతానం. దీంతో ఇక చేసేద లేక నిరాశతో, తన మూడేళ్ల కొడుకును శుక్రవారం కొన్ని వేల రూపాయలకు విక్రయించడానికి తండ్రి అంగీకరించాడు.
 
అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు పోలీసులు తెలిపారు.