ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (21:36 IST)

వైసీపీకి ఏలూరు మేయర్ దంపతుల షాక్.. ఏమైంది?

ysrcpjagan
ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. 
 
ఈ లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపారు. ఇందులో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యుడు పెదబాబు. 
 
అంతేగాకుండా మంగళవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో మరికొంత మంది కార్పొరేటర్లతో మేయర్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు.