ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (18:18 IST)

వైఎస్సార్సీపీకి మరో షోక్- పార్టీ సభ్యత్వానికి ఆళ్ల నాని రాజీనామా.. కారణం అదే?

alla nani
వైఎస్సార్సీపీకి మరో షోక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. గతంలో పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేసిన ఆళ్ల నాని.. ఇప్పుడు ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆళ్ల నాని ప్రకటించారు.
 
గతంలో పార్టీ పదవులకు, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినట్లు నాని ప్రకటించారు. అప్పుడు, ఇప్పుడూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 
 
అంతేకాదు.. ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసినట్లు నాని తెలిపారు. కార్యాలయ స్థలం లీజు ముగిసిందని.. దాంతో స్థలాన్ని యజమానికి అప్పగించామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా స్థల యజమాని అనుమతి మేరకే జరిగిందని చెప్పుకొచ్చారు.