శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2024 (16:41 IST)

బీఆర్ఎస్ నాయకుడి రాసలీలలు.. చెప్పుతో కొట్టిన భార్య.. వీడియో

couple
ఏపీలో వైకాపా నేత దువ్వూరి శ్రీనివాస్ వివాహేతర సంబంధానికి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరుణంలో తెలంగాణలో కూడా ఓ రాజకీయ నేత వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
బీఆర్ఎస్ నాయకుడి రాసలీలలు తెలుసుకుని ఆతని భార్య చెప్పుతో కొట్టింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముచ్చర్లకు చెందిన బీఆర్ఎస్ నేత గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి కట్టుకున్న భార్యను కాదని.. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 
 
ఈ విషయం భార్యకు తెలిసింది. భర్తతో గొడవకు దిగింది. అయినా ఏమాత్రం వినలేదు. ప్రియురాలి కోసం కరీంనగర్ జిల్లాలోని ముచ్చర్ల నుంచి హైదరాబాద్‌లోని అల్వాల్‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకుని  భర్తకు తెలీకుండా ప్రియురాలి ఇంటికి వచ్చి ప్రియురాలి చెంప ఛెళ్లుమనిపించింది. 
 
చివరకు ప్రియురాలితోపాటు భర్తను గంభీరావు‌పేట్‌కు తీసుకెళ్లి దేహశుద్ది చేసింది బాధితురాలి ఫ్యామిలీ. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.