గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2024 (09:24 IST)

మార్క్ జుకెర్ బర్గ్ అరుదైన బహుమతి.. ఎవరికిచ్చారు?

zucker berg gift
మార్క్ జుకెర్ బర్గ్. ఫేస్‌బుక్ సహ అధినేత. ఆయన ఓ అరుదైన బహమతిని తన సతీమణికి ఇచ్చారు. అదీ కూడా ఆమె జీవితంలో గుర్తుండిపోయేలా అపురూపమైన బహుమతి ఇచ్చారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో తన ప్రియురాలికి లేదా సతీమణికి జీవితాంతం గుర్తుండిపోయేలా అపురూపమైన బహుమతి ఇవ్వాలని భావిస్తుంటారు. సామాన్యులు మొదలుకొని ప్రముఖులు, సెలబ్రిటీల వరకూ వారి వారి స్థాయిలో బహుమతిని అందిస్తూ ఉంటారు. ఈ కోవలోనే ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన సతీమణి ప్రిన్సిల్లా చానుకు వినూత్నమైన బహుమతి అందించి తన ప్రేమను చాటుకున్నారు. తన అర్థాంగికి జీవితాంతం గుర్తిండిపోయేటువంటి బహుమతి అందించారు.
 
అది ఏమిటంటే .. రోమన్ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి కానుకగా ఇచ్చారు. ఆ శిల్పాన్ని వారి ఇంటి పెరటిలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన శిల్పం వద్ద ప్రిన్సిల్లా కాఫీ సేవిస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. లక్షలాది మంది ఫాలోవర్స్ లైక్‌‍లు ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విగ్రహాన్ని న్యూయార్క్ నగరానికి చెందిన ప్రసిద్ధ కళాకారుడు డేనియల్ ఆర్షమ్ రూపొందించినట్లు తెలిసింది.
 
కాగా, జుకర్ బర్గ్ - ప్రిన్సిల్లాది లవ్ మ్యారేజ్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నారు. 2012 మే 19న వివాహం చేసుకుని దంపతులుగా మారారు. వీరికి ముగ్గురు సంతానం.