అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ- వెడ్డింగ్.. వెయ్యి కోట్లు ఖర్చు?
Anant Ambani, Radhika Merchant
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం ముఖేష్ అంబానీ భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకల కోసం రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టినట్లు టాక్ వస్తోంది.
ఈ ఉత్సవాల్లో అతిరథ మహారథులు పాల్గొన్నారు. వారికి చేసిన ఏర్పాట్లు భలే అనిపించాయి. 21-65 మంది చెఫ్‌లచే తయారు చేయబడిన మెనూ అదిరింది. అంబానీ నివాసంలోని విశాలమైన 3,000 ఎకరాల తోటలో ఈవెంట్‌లు జరిగాయి.
అదనంగా, ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం స్టార్-స్టడెడ్ గెస్ట్ లిస్ట్‌లో రిహన్న, జె బ్రౌన్, డ్వేన్ బ్రావో, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖ వ్యక్తులు, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.