ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (13:44 IST)

అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్.. ఉపాసన పాదాలకు చెర్రీ మసాజ్

Ramcharan _Upasana
Ramcharan _Upasana
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగుతోంది. 
 
ఈ వేడుకకు ఆహ్వానం అందడంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు శుక్రవారం జామ్ నగర్ బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తూ ఉపాసన కునుకు తీయగా.. రామ్ చరణ్ ఆమె పాదాలకు మసాజ్ చేశాడు.
 
దీనిని రామ్ చరణ్ అసిస్టెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన మహిళలు రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ వీడియో చూసిన మహిళా అభిమానులు.. చెర్రీ ఆదర్శ భర్త అని, బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా, రామ్ చరణ్ భార్య పట్ల కేరింగ్‌గా వుంటారు. ఇంట్లో బయట ఎక్కడికి వెళ్లినా ఆమెకు సాయం చేస్తుంటారు.