ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (12:48 IST)

భార్యల చేతుల్లో చావు దెబ్బలు తినే తెలంగాణ భర్తలు

couples
తెలంగాణలో జరిగిన ఓ సర్వే అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా భార్యల చేతుల్లో చావు దెబ్బలు తింటున్న భర్తలు అనే అంశంపై ఈ సర్వే జరిగింది. బయో సోషల్ స్టడీస్ అనే సర్వే సంస్థ దీనిని నిర్వహించింది. భార్య చెప్పిన మాట వింటూ.. అత్తమామల్ని, భర్తను, పిల్లల్ని చూసుకునే కాలం గడిచింది. ప్రస్తుతం సీన్ మారిపోయింది. 
 
తాజాగా భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తలు అనే అంశంపై సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన అధ్యయనాని కేంబ్రిడ్జి వర్శిటీ ప్రెస్ ప్రచురించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయమొకటి వెలుగు చూసింది. 
 
ఇలా భార్యల చేతిలో చావు దెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణలోనే ఎక్కువట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చావుదెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువని తేలింది. భారత్‌‌లో పురుషులకు రక్షణ చట్టాలు లేకపోవడమే కారణమని అధ్యయనం తేల్చింది.