అనంత్ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్.. కంటతడి పెట్టిన ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంత్ తన ఆరోగ్య సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు, ముకేష్ అంబానీ కంట తడిపెట్టారు. అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా తనతో పెళ్లికి అంగీకరించిన రాధికకు థ్యాంక్స్ చెప్పారు. రాధిక తనకు భార్య కానుండటం తన అదృష్టమని తెలిపారు.
ఇంకా అనంత్ అంబానీ తన ప్రసంగంలో, రాధికా మర్చంట్‌తో వివాహానికి ముందు వేడుకలను జరుపుకోవడానికి జామ్‌నగర్‌లో సమావేశమైన కుటుంబ సభ్యులు, స్నేహితులు,అతిథుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగించినట్లయితే క్షమించండి. దయచేసి మమ్మల్ని, రెండు కుటుంబాలను క్షమించండి.. అంటూ అనంత్ అంబానీ కోరారు.