సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (22:43 IST)

కర్ణాటకలో షాకింగ్ ఘటన.. ఉప్పులో యువకులు మృతదేహాలు

కర్ణాటకలోని హవేరి జిల్లా గలపూజి గ్రామంలో ఆదివారం (డిసెంబర్ 24) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు గ్రామ బాలురు హేమంత్ (12), నాగరాజ్ (11) సరస్సులో ఈతకు వెళ్లారు. ఇంతలో ఈత కొడుతూ సరస్సులో మునిగి చనిపోయారు. అయితే నీటిలో నుంచి మృతదేహాలను బయటకు తీయడంతో తల్లిదండ్రులు పిల్లలకు అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. 
 
మృత దేహాలను ఉప్పుతో కప్పి ఉంచితే మళ్లీ బతికుతారని తల్లిదండ్రులు నమ్మారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తిని ఐదు గంటల పాటు ఉప్పుతో కప్పి ఉంచితే తిరిగి బ్రతికించవచ్చని ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.