గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (13:47 IST)

రచిన్ రవీంద్ర వీడియో వైరల్.. బామ్మ దిష్టి తీస్తుంటే ..?

Rachin Ravindra
Rachin Ravindra
భారత సంతతి చెందినవాడైనప్పటికీ న్యూజిలాండ్ తరపున ఆడుతున్నాడు రచిన్ రవీంద్ర. తాను ఆడుతున్న మొదటి ప్రపంచకప్‌లోనే తన ఆటతో అందరినీ ఇంప్రెస్ చేశాడు. అత్యధిక పరుగులతో టాప్ లో నిలిచి ఔరా అనిపించాడు. 
 
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి హేమహేమీల సరసన చోటు సంపాదించాడు. వరల్డ్ కప్‌లో 3 సెంచరీలు చేసిన డెబ్యూ ప్లేయర్‌గా నిలిచాడు. తన తండ్రి ఊరైన బెంగళూరులోనే ఈ రికార్డు సృష్టించడం విశేషం. నవంబర్ 4న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడీ అద్భుతం చేశాడు. తాజాగా రచిన్ రవీంద్రకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ మారింది. 
 
బెంగళూరులోని నివాసంలో అతడి బామ్మ దిష్టితీస్తున్న వీడియో బయటకు వచ్చింది. బామ్మ దిష్టి తీస్తుంటే బుద్ధిగా కూచున్నాడు రచిన్. ఈ వీడియో చూసిన వారంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు పెద్దల పట్ల అతడు చూపిస్తున్న గౌరవానికి నెటిజనులు ఫిదా అవుతున్నారు.