గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (12:00 IST)

రష్మిక డీప్ ఫేక్ వీడియో... ఆగ్రహం వ్యక్తం చేసిన కల్వకుంట్ల కవిత

kavitha
ప్రముఖ హీరోయిన్ రష్మికు సంబంధించి డీప్ ఫేక్ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెరాస మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం అత్యంత దారుణమని తెలిపారు. ఆన్‌లైన్ వేదికగా ఎవరిపై అయినా ఇలాంటి భయానక రీతిలో ఇలాంటి తారుమారు వీడియోలు రూపొందించడం ఎంత సులభమో రష్మిక ఉదంతం వివరిస్తోందని కవిత అభిప్రాయడ్డారు. 
 
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందన్నారు. సైబర్ బెదిరింపుల నుంచి భారత మహిళలకు భద్రత కల్పించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. ఈ విషయంలో మహిళలకు తక్షణ భద్రత కల్పించాలని ఆమె కోరారు. 
 
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు ఈ అంశంపై వెంటనే స్పందించి ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు.